SDPT: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 9న “ఒక ఉద్యోగి-ఒక మొక్క” పేరిట మెగా ప్లాంటేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. జిల్లాలోని ప్రతి ఉద్యోగి ఈ ప్లాంటేషన్ డ్రైవ్ లో పాల్గొని మొక్కలు నాటుతారని తెలిపారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. సుస్థిరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.