NLR: జిల్లాలో గతవారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విత్ స్కిన్ చికెన్ కేజీ ధర రూ.220 ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ. 230 పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ. 10–20 వరకు పెరగడం గమనార్హం. అయితే, దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.