ATP: ఈ నెల 9న జరగనున్న ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని విమర్శించారు. ఎరువులు, యూరియా బ్లాక్ మార్కెట్కు తరలుతోందని ఆరోపించారు. రైతులకు అండగా వైసీపీ నిలుస్తుందని ఆయన తెలిపారు.