ATP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిని వదిలి వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. సెప్టెంబర్ 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండటంతో పోలీస్ భద్రత ఆ కార్యక్రమానికి కేటాయించారని తెలిపారు. పర్యటన పూర్తైన తర్వాత తిరిగి రావాలని సూచించారు. తాను వెళ్లేందుకు లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాలని పెద్దారెడ్డి కోరారు.