NLG: జిల్లాలో జాతీయ కుటుంబ సంక్షేమ పథకానికి అనూహ్య స్పందన లభిస్తుంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో పెద్ద ఎత్తున బాధిత కుటుంబాలు ముందుకు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నాయి. జిల్లావ్యాప్తంగా 10రోజుల్లోనే 12740 దరఖాస్తులు వచ్చాయి.పేద కుటుంబాలకు చెందిన ఇంటిపెద్ద మరణిస్తే ఆ ఇంటికి రూ.20 వేల తక్షణ సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని పెద్ద ఎత్తున ఆమె అవగాహన కల్పించారు.