BDK: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం నిత్య కళ్యాణ మహోత్సవం వైభోగంగా జరిగింది. స్వామివారిని పూలమాలతో అద్భుతంగా అలంకరించి నిత్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.