ప్రకాశం: కురిచేడు మండలం పొట్లపాడు ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చేదూరి పృథ్వీరాజ్, మోనికా ప్రకాష్‌లు తెలిపారు. బీపీ, థైరాయిడ్, ఇతర వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు చేస్తామని, అవసరమైన వారికి ఉచితంగానే మందులు పంపిణీ చేస్తామని చెప్పారు.