AP: లిక్కర్ కేసులో బెయిల్ పొందిన నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్, బాలాజీ గోవిందప్ప తమ విడుదల ఆలస్యమైనందుకు రేపు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. బెయిల్ మంజూరైనప్పటికీ, జైలు అధికారులు తమను మూడు గంటల పాటు కావాలని విడుదల చేయలేదని ఆ పిటిషన్లో పేర్కొననున్నారు. ఈ ఆలస్యంపై నిందితుడు ధనుంజయ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.