ASR: హుకుంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బురిడీ నవనీత్ అనే విద్యార్థి పిచ్చి కుక్క దాడికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాల సమీపంలోని ఒక దుకాణానికి సామాన్లు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. బాలుడిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.