SRD: కోహిర్ మండలం బడంపేట గ్రామం శ్రీ రాచన్న స్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు అర్చకులు మూసివేశారు. ఉదయం స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన, అన్నపూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం వితరణ చేశారు. రాత్రికి చంద్ర గ్రహణం ఉన్నందున ఆలయ ద్వారాలు మూసి, ద్వార బంధనం చేసినట్లు అర్చకులు తెలిపారు.