భారత ఐటీ పరిశ్రమ వృద్ధిని కాపాడేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. USలో భారత ఐటీ ఔట్ సోర్సింగ్ సంస్థలను ట్రంప్ లక్ష్యంగా చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఇతర సర్వీస్ ఆపరేషన్లను భారత్లో నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థలతో టచ్లో ఉన్నట్లు తెలిపారు.