కృష్ణా: లింగవరం గ్రామం మాజీ సర్పంచ్ గాదిరెడ్డి రామలింగారెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రి కొడాలి నాని ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామలింగారెడ్డి మృతి వైసీపీకి తీరని లోటని, చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమని అన్నారు. గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడిన నిజమైన నాయకుడని తెలిపారు.