ప్రకాశం: సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి రావడం వలన భూమి నీడ చంద్రునిపై పడుతుందని దాని ఫలితంగా చంద్రగ్రహణం ఏర్పడుతుందని కనిగిరికి చెందిన జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు .శాస్త్రీయంగా ఏర్పడే గ్రహణాన్ని ప్రజలందరూ వీక్షించాలని గ్రహణం సమయలో తాగినా, తిన్నా ఏమీ కాదని, ప్రజలు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని అన్నారు.