వరంగల్ కాశిబుగ్గలోని రంగనాథస్వామి దేవాలయంలో ఆదివారం సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. నేడు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ వ్రతాన్ని నిర్వహించినట్లు దేవాలయం మాజీ అధ్యక్షుడు వంగరి రవి తెలిపారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి ఉండాలని కోరుకున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, రామాచార్యులు, తదితరులున్నారు.