WGL: సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు మోసాల నుంచి రక్షణకు ఇవాళ సూచనలు జారీ చేశారు. తెలియని వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయకూడదని, అపరిచితులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వకముందు ఆలోచించాలని సూచించారు. ఆఫర్ల కోసం మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు ఇవ్వవద్దని, సోషల్ మీడియాలో స్నేహితులకు వ్యక్తిగత వివరాలు తెలియజేయవద్దని పేర్కొన్నారు. గుర్తు తెలియని OTP పట్ల జాగ్రత్త వహించాలని కోరారు.