TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం గుబ్బేడితండాలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి సపావత్రాజా(60)ను కుమారుడు సపావత్ సురేష్(28) కొట్టి చంపాడు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తుందని భార్య మౌనికను చంపేందుకు ప్రయత్నించగా.. అడ్డు వచ్చిన తండ్రిని కొట్టి చంపినట్లు తెలుస్తోంది. మృతుని కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.