KNR: వినాయక ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల చింతకుంట చెరువు కట్ట వద్ద అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి డా. ప్రమోద్ కుమార్, ఉప వైద్యాధికారి డా.శ్రీనివాస్ ఉచిత క్యాంపును శనివారం సాయంత్రం సందర్శించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు.