విశాఖ: ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో అనువైన భూములను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను ఈ ఏడాది నవంబరులో గూగుల్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో విశాఖ అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.