NRML: నిర్మల్ పట్టణం ఈద్గామ్ గణపతి లడ్డూ వేలంలో లడ్డూ రూ.1,88,888కి అమ్ముడైంది. ఈద్గామ్లో ఇంటర్నెట్ నిర్వాహకురాలు అమ్రీన్ శనివారం రాత్రి జరిగిన వేలం పాటలో లడ్డూను సొంతం చేసుకుని హిందూ,ముస్లిం మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచారు. ఈ సందర్భంగా భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.