NLR: ఉలవపాడు సౌత్ బైపాస్‌లో హైవేపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణపై పోలీసులు దృష్టి పెట్టారు. కావలి వైపు నుంచి ఉలవపాడులోకి వచ్చే వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దాంతో హైవే నుంచి ఉలవపాడులోకి ఎంట్రీ మార్గాన్ని మూసేశారు. ఇక నుంచి కావలి వైపు నుంచి ఉలవపాడు వచ్చే వాహనాలు అండర్ పాస్ ద్వారా రావల్సి ఉంటుందని ఎస్సై అంకమ్మ తెలిపారు.