E.G: నిడదవోలు మండలం జీడిగుంట గ్రామ పంచాయతీ పరిధిలో దోమల వ్యాప్తి నివారించడానికి డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టినట్లు కార్యదర్శి భీమేశ్వరరావు తెలిపారు. గ్రామంలో ఇప్పటికే చాలా చోట్ల పనులు పూర్తయ్యాయని ఆదివారం ఆయన చెప్పారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తమను సంప్రదించవచ్చని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.