KMM: యూటీఎఫ్ సీనియర్ నాయకులు జియా ఉద్దీన్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఖమ్మంలో మరణించారు. వారి మృతి పట్ల వామపక్ష, కార్మిక, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతాపం ప్రకటించారు. సీపీఎం ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులుగా, తిరుమలాయపాలెం మండల కార్యదర్శిగా, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులుగా సేవలందించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేశారు.