E.G: దేవరపల్లి మండలంలోని రామన్నపాలెం ఉన్నత పాఠశాలలో ఈనెల 9వ తేదీన ఉమ్మడి జిల్లా బాలబాలికల టెన్నికాయిట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షులు జి.చంద్రశేఖర్, ఎ.వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఆరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వివరించారు. మరిన్ని వివరాలకు క్రీడాకారులు నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.