AP: విజయవాడ సబ్ జైలు దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. జైలు అధికారుల తీరుపై అడ్వొకేట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్ ఇచ్చినా.. విడుదల చేయకపోవడంపై అడ్వొకేట్లు ఆందోళన చేస్తున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, నిన్న ధనుంజయ్, కృష్ణమోహన్, గోవిందప్పకు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.