VKB: పెద్దేముల్ మండలంలోని దళితవాడలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ కబ్జాకు గురవుతోందని జై భీమ్ యువజన సంఘం నేతలు మేజర్ పంచాయతీకి ఫిర్యాదు చేశారు. శిథిలావస్థకు చేరిన కమ్యూనిటీ హాల్‌ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జా నుంచి రక్షించి, ఆ స్థలంలో కొత్త అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలన్నారు.