GNTR: దుగ్గిరాలలో ఉచిత యోగ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. గ్రామంలోని శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోగా గురువు కోరారు. ప్రాణాయామం, యోగా చేయడం ద్వారా కొన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ శిబిరం 21 రోజుల పాటు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.