KMM: మధిర బ్రాంచ్ సాగర్ కెనాల్‌కు ఆదివారం నుంచి 12వ తేదీ వరకు సాగు నీరు నిలిపివేయనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వారబందీ విధానం అమలు చేస్తున్నందున ఆరు రోజుల పాటు నీటి విడుదల ఉండదని పేర్కొన్నారు. తిరిగి 13 నుంచి 18వ తేదీ వరకు నీరు సరఫరా చేస్తామని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని అధికారులు సూచించారు.