NLG: సంపూర్ణ చంద్రగ్రహనాన్ని పురస్కరించుకొని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంను ఈరోజు మ. గం.12:00 నుండి మూసివేయనున్నారు. గుట్ట కింద అమ్మవారి ఆలయం, ఉప ఆలయాలు కూడా మూసివేస్తారు. తిరిగి సోమవారం ఉ. గం.8.00 ల నుండి భక్తులకు దర్శనము, ఆర్జిత సేవలు జరుపబడుతాయని అర్చకులు తెలిపారు.