KNR: మానకొండూర్ మండలం చెంజర్ల శివారులోని గంగిపల్లి మూలమలుపు వద్ద మోరీ కూలి రహదారి ప్రమాదకరంగా మారింది. 25 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దారిలోని వరద నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మోరీ కూలి గుంత ఏర్పడింది. వాహనదారులు గుర్తించి ప్రమాద సూచికగా రాళ్లు వేశారు. ఈ గుంత వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే మరమ్మతులు చేయించాలని వారు కోరారు.