NLR: సీతారామపురం మండల కేంద్రంలోని సచివాలయం-1 లో శనివారం ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆధార్ కేంద్రంలో నూతన ఆధార్ కార్డులు నమోదు చేయడం, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, ఆధార్ నెంబర్కు ఫోన్ నెంబర్ లింక్ చేయడం తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.