GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (నూటా) నూతన అధ్యక్షుడిగా ఆచార్య పండు బ్రహ్మాజీరావు, కార్యదర్శిగా ఆచార్య ఎం. త్రిమూర్తిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఉత్తర్వులను ఎన్నికల అధికారి ఆచార్య మురళీమోహన్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని యూనివర్సిటీ వీసీ కే. గంగాధర్ అభినందించారు.