PDPL: సింగరేణిలో జేఎంఈటీలుగా చేరి టెర్మినేట్ అయిన 43 మందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సీఎండీ ఎన్.బలరాం నాయక్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీరంతా విధులకు గైర్హాజరవడం, ధ్రువపత్రాలను సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించడం జరిగిందన్నారు. త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా వీరిని తిరిగి తీసుకుంటున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.