VZM: కొత్తవలస సంత మార్కెట్లో రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి బి.రవి కిరణ్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.వి.సత్యనారాయణతో కలిసి శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ది అధికారి రమణయ్య, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి కే. విజయ బాబు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.