TPT: రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మినెంట్ చేయాలని జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సీఎంకు లేఖ రాశారు. క్రమబద్ధీకరణలో భాగంగా మిగిలిపోయిన ప్రాసెస్‌ను పునః ప్రారంభించాలని లేఖను మెయిల్ చేశారు. గత ప్రభుత్వం యాక్ట్ 30 జీఓ 114 ప్రకారం రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభించగా ఎన్నికల కోడ్ కారణంగా ప్రాసెస్ ఆగిపోయిన విషయం తెలిసిందే.