ప్రకాశం: మర్రిపూడి మండలంలోని వల్లాయపాలెం వెళ్లే రహదారిలో స్థానిక ఎస్సీ కాలనీ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా చిల్లచెట పెరిగాయని స్థానిక వాహనదారులు చెబుతున్నారు. దీంతో రాకపోకలు సాగించే వారికీ చిల్ల చెట్లు అడ్డుపడి అవస్థలు తప్పడంలేదు. సుమారు పది పంచాయతీల ప్రజలు ఈ రహదారి మీదగానే మండల కేంద్రమైన మర్రిపూడికి రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.