NRML: వాహనాల చోరికి పాల్పడుతున్న 3 వ్యక్తులను భైంసా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొన్నారు. వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులు పోలీసులను చూచి పారిపోతున్న వారిని పట్టుకొని విచారణ చేయగా.. వారు కొన్ని ప్రాంతాలలో వాహనాలు దొంగతనం చేసినట్లు తెలిసింది. విచారణలో 3 ఆటోలు, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ గోపినాధ్ తెలిపారు.