NLG: చిట్యాల మండలం వెలిమినేడులోని బొడ్రాయి చౌరస్తా వద్ద ఉన్న వినాయకుని లడ్డు రూ. 77 వేలు పలికింది. గ్రామానికి చెందిన బుట్టి లక్ష్మీనర్సు పుల్లమ్మ దంపతులు శనివారం రాత్రి జరిగిన వేలంలో దక్కించుకున్నారు. న్యూ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రతిష్టించే వినాయకుని వద్ద లడ్డుకు విశిష్టత ఉండడంతో చాలా మంది పోటీ పడ్డారు.