KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో జాతీయ పోషకాహార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు బాడీ మాస్ ఇండెక్స్ (BMI) తనిఖీలు, పోషకాహార చార్ట్లు తయారీ, వ్యాసరచన, బృంద చర్చ పోటీలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో ఉండాలన్నారు.