ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున టిప్పర్ లారీ అదుపుతప్పి రైల్వే ట్రాక్ క్రాసింగ్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత బ్రిడ్జిపై వేలాడుతున్న లారీని చూసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమీక్షిస్తున్నారు.