HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ చెరువులో కుటుంబ తగాదాల కారణంగా ఆత్మహత్యకు యత్నించిన రహీం అనే వ్యక్తిని, నిమజ్జన విధుల్లో ఉన్న హైడ్రా డి.ఆర్.యఫ్ సిబ్బంది ఆదివారం కాపాడారు. అనంతరం రహీంను పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాపాడిన హైడ్రా సిబ్బందికి రహీం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.