విశాఖ: చంద్రగ్రహణం కారణంగా సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు దర్శన సమయాల్లో మార్పు చేశారు. ఉదయం 11:30 తర్వాత దర్శనాలు నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరిగి మళ్లీ రేపు ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించనున్నారు. ఆలయ దర్శన సమయాల్లో మార్పులు చేపట్టిన కారణంగా ఆదివారం, సోమవారం ఆలయంలో జరిగే ఆర్జీత సేవలను రద్దు చేశారు.