W.G: ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భీమవరం మావుళ్లమ్మ ఆలయం మధ్యాహ్నం 12.30 గంటలకు మూసివేసి సోమవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8.30 గంటలకు తెరుస్తారు. పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్ధనస్వామి ఆలయం మ. 12 గంటలకు మూసివేసి సోమవారం ఉ. 7 గంటలకు, కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఉదయం 11 గంటలకు మూసివేసి సోమవారం 10.30 గంటలకు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు.