SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని సేవా భారతి వినాయక లడ్డును సేవా భారతి యూత్ అధ్యక్షుడు జంగం శంకరయ్య స్వామి రూ. 32 వేలకు వేలం పాట పాడి దక్కించుకున్నారు. శనివారం రాత్రి నిమజ్జన కార్యక్రమం కొనసాగగా, ప్రధాన కూడలిలో 14 కిలోల బరువు గల లడ్డూ వేలం పాట జరిగింది. వేలం పాటను దక్కించుకున్న శంకరయ్య స్వామికి వినాయక మహా ప్రసాదాన్ని నిర్వాహకులు అందించారు.