MBNR: చంద్రగ్రహణం కారణంగా ఉమ్మడి జిల్లాలోని దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు ఆదివారం మధ్యాహ్నం 1:00 సమయానికి తాళాలు వేస్తారని దేవాదాయ శాఖ జిల్లా అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా దేవాదాయ శాఖతో సంబంధం లేని ప్రైవేట్ ఆలయాలు సైతం గ్రహణ సమయాన్ని పాటిస్తూ మధ్యాహ్నం సమయానికి ఆలయాలు మూసివేసి సోమవారం ఉదయం యథాతథంగా భక్తులకు దర్శనం కల్పిస్తామని కోరారు.