KMM: కామేపల్లి మండలంలో ముమ్మరంగా మిర్చి నాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు మిర్చి నాట్లలో అనుసరించాల్సిన మెలకులపై ఏవో బి.తారా దేవి శనివారం క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి, పలు సూచనలు చేశారు. 6 వారాల వయసు గల మొక్కలను నాటుకోవాలని, ప్రొట్రేలులలో నారు పెంచుకున్నట్లయితే నారు ధృఢంగా పెరగడంతో పాటుగా నారు కుళ్లు, వైరస్ తెగులు ఆశించే అవకాశం తక్కువగా ఉంటందన్నారు.