GNTR: పొన్నూరు విద్యార్థులు రాకెట్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఒంగోలులో జరిగిన పోటీలలో విజయం సాధించిన ఈ విద్యార్థులు ఈనెల 25వ తేదీన పుదుచ్చేరిలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, పట్టణ ప్రముఖులు శనివారం అభినందించారు.