E.G: వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా చందన నాగేశ్వర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా పనిచేసిన నాగేశ్వర్‌కు పార్టీ బలోపేతంలో భాగంగా ఈ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు రాజానగరం నియోజకవర్గ పరిశీలకుడిగా కూడా ఆయన వ్యవహరించనున్నారు.