KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు, జోనల్ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది. సెప్టెంబర్ 2-4 మధ్య తమిళనాడు వెల్లూరులో జరిగిన అటారీ వార్షిక సమీక్షలో ఈ గౌరవం దక్కింది. డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు అవార్డు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శి విజయ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గుర్తింపు శాస్త్రవేత్తల బాధ్యతను పెంచిందని అన్నారు.