ఇవాళ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. రాత్రి 8.58 గంటలకు గ్రహణం మొదలై, రాత్రి 11 నుంచి అర్థరాత్రి 12.22 గంటల వరకు పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. రేపు తెల్లవారుజామున 2.25 గంటకు గ్రహణం ముగియనుంది. భారత్తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లోనూ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు.