WGL: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రూ.4.35 కోట్ల వ్యయంతో ఆరు దేవాలయాల అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ శనివారం శంకుస్థాపన చేశారు. కాకతీయుల వారసత్వ సంపదను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.